మాట ఇచ్చాను.. నిల‌బెట్టుకుంటున్నాను

May 15, 2021

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ద్య నిషేధం దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మ‌ద్యంతో మాన‌వ సంబంధాలు నాశ‌న‌మైపోతున్నాయ‌ని, అక్క‌చెల్లెమ్మ‌ల క‌న్నీళ్లు తుడుస్తాన‌ని మాట ఇచ్చాన‌న్నారు. ఈ మేర‌కు మ‌ద్య నిషేధం దిశ‌గా అడుగులు వేస్తూ బెల్టు షాపుల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హరిస్తున్నామ‌ని పేర్కొన్నారు. మ‌ద్యం అమ్మ‌కాల బాధ్య‌త‌ను ప్ర‌భుత్వానికే అప్ప‌గిస్తూ చ‌ట్టాన్ని తెచ్చామ‌న్నారు. త‌ద్వారా గ్రామాల్లో బెల్టు షాపులు పూర్తిగా మూత‌బ‌డ్డాయ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *