సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

May 15, 2021

పార్టీ ఫిరాయింపుల‌పై చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి వస్తే రూ. 40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలు ఆడారని వెల్లడించారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. టీడీపీ వారికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెరవనని, తాను ఎప్పటికీ తన గురువు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *