ఇక ప్రియుడు లేద‌ని తెలిసి…

May 13, 2021

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు లేడ‌ని తెలిసిన ప్రేమికురాలు తీవ్ర నిర్ణ‌యం తీసుకుంది. తాను ఇష్ట‌పడ్డ వ్య‌క్తి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక తానూ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. త‌మిళ‌నాడులోని తిరువొత్తియూరులోని గోపినగర్‌కు చెందిన వ్యాపారి నటరాజన్‌ కుమార్తె అశ్విని (20) లా విద్యార్థిని. ఆమె కొంత‌కాలంగా వేదారణ్యం ప్రాంతానికి చెందిన తెన్నవన్‌ను ప్రేమిస్తోంది. మే 3వ తేదీ అశ్విని ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో తెన్నవన్‌ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తెన్నవన్‌కు గుండెపోటు రావడంతో మృతిచెందాడు. ప్రియుడు మృతిచెందడంతో అశ్విని మ‌నస్థాపం చెందింది. శుక్రవారం రాత్రి ఎవ‌రూ లేని స‌మ‌యంలో అశ్విని త‌న పెద‌నాన్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *