కోడి గుడ్డు కూర కోసం.. భార్యను తుపాకీతో కాల్చేశాడు

May 15, 2021

మద్యం మత్తులో ఉన్న భర్త.. కోడి గుడ్డు కూర వండలేదని భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌దాస్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నవనీత్(33), మంగేశ్ శుక్లా(30)కు 12 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. నవనీత్ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే నవనీత్ మద్యానికి బానిస కావడంతో.. గురువారం పీకల దాకా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఇప్పుడు తనకు కోడి గుడ్డు కూర వండాలని నవనీత్.. భార్యతో డిమాండ్ చేశాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇంట్లోకి వెళ్లిన నవనీత్ తన తండ్రి లైసెన్స్‌డ్ గన్‌ను తీసుకువచ్చి భార్య శుక్లాపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన శుక్లాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *