తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు..

May 15, 2021

చిన్న వయసులోనే తెల్లవెంట్రుకలతో ఇబ్బంది పడేవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. అలాంటప్పుడు తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఇలా చేసి చూడండి.
* రాత్రి పడుకునే ముందు ఉసిరికాయ, కుంకుడుకాయ, శీకాకాయల మిశ్రమాన్ని బాగా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే దాంట్లో మైదాకు కలిపి మరో రెండు గంటలు నానబెట్టాలి. ఆ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత బాగా రుద్ది స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారి బలంగా, ఒత్తుగా పెరుగుతాయి.
* జుట్టుకు రంగేయాలంటే ముందుగా గుర్తొచ్చేది హెన్నా. ఇది చాలా సింపుల్. హెన్నా పౌడర్‌ని ఆముదంలో మరిగించాలి. చల్లబడ్డాక దాన్ని జుట్టు కుదుళ్లకు అంటేలా రాయాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
* కాఫీతోనూ తెల్ల జుట్టును కవర్ చేయొచ్చు. రెండు టేబుల్‌స్పూన్ల కాఫీ పొడిని కప్పు నీటిలో మరిగించాలి. చల్లారాక స్ప్రే బాటిల్‌లో పోసి జుట్టు కుదుళ్లపై చల్లాలి. తర్వాత మసాజ్ చేసి గంటపాటు షవర్‌క్యాప్ ధరించాలి. తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.
* బ్లాక్ టీతో కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. బ్లాక్ టీ పొడిని నీటిలో మరిగించి గోరువెచ్చగా అయ్యాక తలకు రాసి గంట తర్వాత తలస్నానం చేయాలి.
* వాల్‌నట్లను నలిపి అరగంటసేపు నీటిలో మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత కాటన్ బాల్ సాయంతో జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *