ఇచ్చిన మాట‌పై నిల‌బ‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌

May 13, 2021

అర్జున్ రెడ్డితో సూప‌ర్ హిట్ అందుకున్న హీరో అర్జున్ రెడ్డి త‌ను అన్న మాట‌పై నిల‌బ‌డ్డారు. అర్జున్ రెడ్డి సినిమాలో త‌న న‌ట‌న‌కు వ‌చ్చిన తొల ఫిల్మింఫేర్ అవార్డును వేలం వేయ‌గా వ‌చ్చిన డ‌బ్బుల‌ను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అంద‌జేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఈరోజు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌ని క‌లిసి వేలం వేయ‌గా వ‌చ్చిన రూ.25 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్‌ని మంత్రి కేటీఆర్ అభినందించి, ఓ మొక్క‌ను అంద‌జేశారు. హరిత‌హారం, జ‌లం- జీవం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు విజ‌య్ దేవ‌ర‌కొండ చెక్కు అంద‌జేసిన విష‌యాన్ని కేటీఆర్ త‌న ట్వీట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదే విష‌యాన్ని విజ‌జ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్వీట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *