ట్విట్టర్ లో 70 మిలియన్ల నకిలీ అకౌంట్లు.. తొలగింపు

May 15, 2021

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నకిలీ అకౌంట్లపై కొరడా ఝులిపించడం కొనసాగిస్తున్నది. అందులో భాగంగానే మే, జూన్ నెలల్లో మొత్తం 70 మిలియన్ల నకిలీ అకౌంట్లను ట్విట్టర్ నుంచి తొలగించారు. గతేడాది అక్టోబర్‌లో డిలీట్ చేసిన అకౌంట్ల సంఖ్యకు ఇది రెట్టింపు కావడం విశేషం. కాగా దీనిపై ట్విట్టర్ స్పందిస్తూ నకిలీ అకౌంట్లు, నకిలీ వార్తలు, తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే నకిలీ అకౌంట్లను ట్విట్టర్ నుంచి తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.

నకిలీ అకౌంట్లే టార్గెట్..

70 మిలియన్ యూజర్లను తొలగిస్తే ట్విట్టర్‌ను వాడే యూజర్ల సంఖ్య తగ్గుతుందని, అయినప్పటికీ అవి నకిలీ అకౌంట్లే అయినందున ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వారు చెప్పారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే అసలు యూజర్లకు నాణ్యమైన సేవలు, సమాచారం అందించాలంటే నకిలీ అకౌంట్లను తొలగించాల్సిదేనని అన్నారు. ట్విట్టర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ వైస్ ప్రెసిడెంట్ డెల్ హార్వే మాట్లాడుతూ.. ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న నకిలీ అకౌంట్లను ఇకపై కూడా తొలగిస్తామని, అందులో ఉండే అసలైన యూజర్లకు మరిన్ని ఫీచర్లతో కూడిన సేవలు అందిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *