సుప్రీం గడప తొక్కనున్న తెలంగాణ

May 15, 2021

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దన్న హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం క్యాబెనెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని ఆయన ఆదేశించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 61 శాతానికి చేరుతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ తన సర్పంచ్ తో పిటీషన్ వేయించి, బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *