తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు..

May 13, 2021

తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ నిర్మాత బోణీకపూర్ కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. వీరితో పాటు శ్రీదేవి సోదరి మహేశ్వరి కూడా ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో బోణీకపూర్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పట్టువస్ర్తాలతో సత్కరించారు.

శ్రీవారిని తెలుగు రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఈ రోజు సుప్రభాత సేవలో ఆయన కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *