ఫలిస్తున్న థాయ్ ఆపరేషన్.. 8 మంది చిన్నారులు గుహ నుంచి బయటకు..

May 14, 2021

థాయిలాండ్‌లోని థామ్ లాంగ్ గుహలో చిక్కుకున్న చిన్నారుల్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకువస్తున్నది. ఆదివారం నలుగురు పిల్లల్ని బయటకు తీసిన గజ ఈతగాళ్ళు ఇవాళ మరో నలుగురు పిల్లల్ని బయటకు తీసుకువచ్చారు. దీంతో మొత్తం రెస్క్యూ చేసిన పిల్లల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నది. జూన్ 23న గుహలో చిక్కుకున్న చిన్నారులను కాపాడేందుకు థాయ్ ప్రభుత్వం శతప్రయత్నాలు చేస్తోంది. 25 ఏళ్ల కోచ్‌తో సహ మొత్తం 13 మంది పిల్లలు గుహలో చిక్కుకున్న విషయం తెలిసిందే. థాయ్‌ల్యాండ్‌తో పాటు అంతర్జాతీయ గజ ఈతగాళ్ళు ఇవాళ ఆక్సిజన్ సిలెండర్లతో గుహలోకి ప్రవేశించారు. పిల్లల్ని బయటకు తీసుకురాగానే వాళ్లను మెడికల్ సెంటర్‌కు తరలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *