తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం

May 15, 2021

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. బీఎఫ్‌ఏ, ఎంపీఏ నృత్యం, ఎంఏ జ్యోతిష్యం కోర్సులకు 9న, ఎంపీఏ జానపద కళలు, ఎంఏ కర్ణాటక సంగీతం, గాత్రం, మృదంగం 10న, ఎంపీఏ రంగస్థల కళల కోర్సులకు 11న హైదరాబాద్‌లో ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. చరిత్ర పురావస్తు శాస్త్రం పరీక్షలు శ్రీశైలం ప్రాంగణంలో 11న, ఎంపీఏ కూచిపూడి ప్రాంగణంలో 11న ఉదయం 11గంటల నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల కన్వీనర్ హన్మంతరావు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *