అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

May 15, 2021

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తెలంగాణ విద్యార్థిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వరంగల్ నగరంలోని కొత్తవాడ వాసవీ కాలనీకి చెందిన శరత్ కొప్పుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మిస్సోరిలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. స్నేహితుల ద్వారా శరత్ తల్లిదండ్రులకు సమాచారం అందింది. కుమారుడి సమాచారంపై శరత్ తల్లిదండ్రులు డీజీపీని కలిశారు. శరత్ తండ్రి హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ కుమారుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *