రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తెలంగాణ హైకోర్టులో విచార‌ణ‌

May 13, 2021

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తెలంగాణ హైకోర్టులో సోమ‌వారం విచార‌ణ జరిగింది. కాంగ్రెస్ నేత‌లు వంశీచంద్ రెడ్డి, శ్రీనివాస్ లు వేసిన పిటిష‌న్ల‌ను హైకోర్టు విచారించింది. పిటిషన్లు రెండు రాష్ట్రాల జ‌ల‌వివాదానికి సంబంధించిన‌వి కావున హైకోర్టు ప‌రిధిలోకి ఏలా వ‌స్తుంద‌ని కోర్టు పిటిషన‌ర్లను ప్ర‌శ్నించింది.

ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ల త‌రుపు న్యాయ‌వాది శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ… రాష్ట్ర పున‌ర్ విభ‌జ‌న ప‌రిధిలో కేసును విచారించాల‌ని కోరారు. అంత‌రాష్ట్ర జ‌ల‌వివాదానికి సంబంధించిన అంశం కావునా దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాల‌ని తెలంగాణ హైకోర్టు పిటిష‌న‌ర్ల‌కు సూచించింది. పిటిష‌న‌ర్ల‌తో చ‌ర్చించి త‌మ నిర్ణ‌యం చెబుతామ‌ని న్యాయ‌వాది శ్ర‌వ‌ణ్ హైకోర్టుకు తెలియ‌జేశారు. అనంతరం విచార‌ణ‌ను హైకోర్టు రేప‌టికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *