హ‌స్తిన‌లో బిజీబిజీగా టీడీపీ ఎంపీలు

May 15, 2021

కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎంపీలు, అందుకు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీలు సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్, కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, శ్రీ‌రాం మాల్యాద్రి, నిమ్మ‌ల కిష్టప్పలు ఈ రోజు ఉద‌యం ఆప్ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ తాము ప్ర‌వేశ‌పేట్టిన అవిశ్వాసానికి ఆప్ మ‌ద్ద‌తు కోరిన‌ట్లు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల ప‌ట్ల అవ‌లంభిస్తున్న వైఖ‌రిని కేజ్రీవాల్‌కు వివ‌రించిన‌ట్లు వివ‌రించారు. అవిశ్వాస తీర్మాన మ‌ద్ద‌తుకు సానుకూలంగా స్పందిచిన‌ట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *