టాటూలపై ప్రేమ.. పురుషాంగాన్ని కట్ చేయించుకున్న ఘనుడు

May 15, 2021

రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌కు చెందిన 32 ఏళ్ల అడమ్ కర్లీకలె టాటూల కోసం తన పురుషాంగాన్నే కట్ చేయించుకున్నాడు. అడమ్ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. క్యాన్సర్ కారణంగా అడమ్ శరీరమంతా మచ్చలు మచ్చలుగా మారింది. దాంతో పాటు అడమ్ బొల్లి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ మచ్చలతో అడమ్ బయటికి వెళ్లాలంటే భయపడేవాడు. దాని నుంచి తప్పించుకోవడానికి ఒళ్లంతా టాటూలు వేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఒళ్లంతా ఐబాల్స్ టాటూలు వేయించుకున్నాడు.

శరీరం అంతా టాటూలే..  ఆడమ్ కు శరీరంలో 90 శాతం మాత్రమే టాటూలు కవర్ అయ్యాయి. ప్రైవేట్ పార్ట్స్‌లో మాత్రం టాటూలు కవర్ కాలేదు. అక్కడ టాటూ వేయడం సమస్యగా మారింది. ఎలాగైనా శరీరం మొత్తం టాటూలు కవర్ చేయాలనుకొని తన ప్రైవేట్ పార్ట్స్‌ను కట్ చేయించుకున్నాడు. పురుషాంగం, వృషణాలు, చాతి దగ్గర ఉండే చనుమొనలను ఆపరేషన్ ద్వారా తీసేయించుకున్నాడు అడమ్.

మెక్సికో లో ఆపరేషన్..  ఈ ఆపరేషన్ కోసం అడమ్ రష్యా నుంచి మెక్సికో వెళ్లాడు. మెక్సికోలో ఈ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ అనంతరం హాస్పిటల్‌లో ఉన్న అడమ్ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అడమ్ టాటూల స్టోరీ వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *