యూనివర్సిటీలో చిరుత కలకలం

May 15, 2021

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. యూనివర్సిటీ పక్కనే ఉన్న అడవుల్లో చిరుత పులి కొద్ది రోజులుగా సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా… అడవి సమీపానికి మేతకు వెళ్లిన రెండు ఆవుదూడలను చిరుతపులి చంపినట్లు తెలుస్తోంది. దీంతో యూనివర్సిటీకి చెందిన విద్యార్ధులతోపాటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *