స్పీడ్‌పోస్ట్‌లో పెళ్లికుమార్తె నగ్నవీడియో

May 14, 2021

తెల్లారితే పెళ్లి… అంతా వివాహ వేడుకల్లో హడావిడిగా ఉన్నారు. ఇంతలో పెళ్లికొడుకు ఇంటికి స్పీడ్‌పోస్ట్‌లో ఓ పార్శిల్‌ వచ్చింది. దాన్ని ఓపెన్‌ చేస్తే అందులో సెల్‌ఫోన్‌ ఉంది. ఫోన్‌లోని వీడియోలు ప్లే చేయగా… తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్నపుడు తీసిన నగ్నదృశ్యాలు కనిపించాయి. దీంతో ఆ పెళ్లికొడుకు తాను ఈ పెళ్లిచేసుకోనని ఖరాఖండిగా చెప్పేశాడు. చేసేదేమీ లేక పెళ్లికుమార్తె తండ్రి అమలాపురం తాలూకా పోలీసులను ఆశ్రయించాడు.  అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడికి చెందిన యువతిని ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన యువకుడికిచ్చి శనివారం ఉదయం పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. కొత్తలంకలో వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. శుక్రవారం ఉదయం కాకినాడ నుంచి పెళ్లికొడుకు పేరిట కొరియర్‌ వచ్చింది. అందులోని వీడియోలు చూసిన అబ్బాయి పెళ్లి రద్దు చేసుకున్నాడు. వీడియోల్లో కొంత మార్ఫింగ్‌ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నగ్నవీడియోల కారణంగా పెళ్లి ఆగిపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *