సింగర్ సునీత రెండో పెళ్లి..?

May 15, 2021

సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెర‌కు సుప‌రిచ‌త‌మైన సునీత రెండో వివాహం చేసుకుంటున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. చిన్న వ‌య‌స్సులోనే సినీ ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించిన సునీత ఇప్ప‌టి 750 చిత్రాల‌కు సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా ప‌నిచేశారు. 19 ఏళ్ల వ‌య‌స్సులోనే కిర‌ణ్ అనే వ్య‌క్తితో సునీత వివాహ‌మైంది. ఆమెకు ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో కిర‌ణ్ తో ఆమె విడాకులు తీసుకున్నారు.

విడాకుల త‌ర్వాత చాలా ఏళ్లు పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటున్న సునీత రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేద‌ని అనేక ఇంట‌ర్వ్యూల‌లో చెప్పారు. అయితే, తాజాగా ఆమె నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఓ ఐటీ కంపెనీ ఓన‌ర్‌ను ఆమె పెళ్లాడ‌తార‌ని, అత‌డు కూడా సునీత నివ‌సించే అపార్ట్ మెంట్ లోనే నివ‌సిస్తార‌ని తెలుస్తోంది. మొత్తానికి విడాకుల త‌ర్వాత చాలా రోజుల‌కు ఒంట‌రి జీవితానికి సూనీత దూరం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *