శరత్‌‌ను చంపిన దుండగుడి కాల్చివేత

May 13, 2021

తెలుగు విద్యార్థి కొప్పు శరత్‌ను హత్య చేసి పరారైన దుండగుడిని ఎట్టకేలకు అమెరికా పోలీసులు కాల్చి చంపేశారు. కేన్సస్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో అతడిని మట్టుబెట్టారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. అయితే వారి పరిస్థితి ప్రమాదకరంగా లేదని వైద్యులు ప్రకటించారు. నిందితుడికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు అతడి కోసం జల్లెడపట్టారు. ఈ క్రమంలో దుండగుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దాంతో అతడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో దుండుగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయతే దుండగుడి వివరాలను పోలీసులు ఇంకా బయటపెట్టలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *