కేటీఆర్ స‌వాల్‌ను స్వీక‌రించిన‌ స‌చిన్‌

May 13, 2021

తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన హరిత‌హారం చాలెంజ్ ను క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండుల్క‌ర్ స్వీక‌రించారు. ఇందులో భాగంగా స‌చిన్ మొక్క‌లు నాటి నీళ్లు పోశారు. ఈ ఫోటోల‌ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి, త‌న‌ను ఈ చాలెంజ్ కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భూమిని ప‌చ్చ‌గా ఉండేలా చేయ‌డం మ‌నంద‌రి చేతుల్లో ఉంద‌ని స‌చిన్ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్‌…థ్యాంక్యూ మిస్ట‌ర్‌..మీరూ మ‌రో ఐదుగురికి ఈ స‌వాల్ చేయండి అని రిప్లై ఇచ్చారు. ఇక మ‌రో క్రికెటర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ కు కూడా కేటీఆర్ స‌వాల్ ను స్వీక‌రించి మొక్క‌లు నాటారు. ఆయ‌న వీరేంద్ర సెహ్వాగ్‌, మ‌హిళా క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కు సైతం ఈ చాలెంజ్ చేశారు. మొత్తానికి తెలంగాణ‌లో చేప‌ట్టిన నాలుగో విడ‌త హ‌రిత‌హారం దేశ‌వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *