‘సాహో’ సర్ప్రైజ్ లుక్

May 15, 2021

సినిమా విడుదలను పోస్ట్ ఫోన్ చేసి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన ‘సాహో ‘ టీం ఇప్పుడు ప్రభాస్, శ్రద్ద కపూర్ కలిసి ఉన్న ఒక రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ పోస్టర్ సినిమాలో ఉన్న రొమాంటిక్ సాంగ్ కి సంభందించినదిగా కనిపిస్తుంది. గతంలో రిలీజ్ అయిన సాంగ్ లో దర్శకుడు సుజీత్ ప్రభాస్ లుక్ పై ఇంకొంచెం శ్రద్ద పెడితే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో ఆ లోటు ఎక్కడా కనిపించటం లేదు. ఇక సినిమా రిలీజ్ డేట్‌ను తెలుపుతూ ఈ పోస్టర్ ను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో విడుదల చేశారు యూవీ క్రియేషన్స్ వారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *