గులాబీ పువ్వుల టీ తాగితే ఎన్నో లాభాలు..!

May 15, 2021

గులాబీ పువ్వుల గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. వాటి అందానికి, సువాసనకు దాసోహం కానివారు ఎవరూ ఉండరు. అయితే కేవలం అందుకు మాత్ర‌మే కాకుండా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ గులాబీ పువ్వులు బాగా పనిచేస్తాయి. గులాబీ పూల రెక్కలతో తయారు చేసే టీని రోజూ తాగితే దాంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

గులాబీ పువ్వుల టీ తయారు చేసే విధానం…
ఒక పాత్రలో కొంత నీటిని తీసుకుని అందులో కొన్ని శుభ్రం చేసిన గులాబీ పువ్వు రెక్కలను వేయాలి. అనంతరం ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో ఆ నీటిలోకి గులాబీ పువ్వు రెక్కల్లో ఉండే ఔషధ పదార్థాలు చేరుతాయి. 20 నిమిషాలపాటు సిమ్మర్‌లో ఉంచి మరిగించాక తయారయ్యే ద్రవంలో కొంత తేనె, నిమ్మరసం వంటివి కలుపుకోవాలి. దీంతో గులాబీ పువ్వుల టీ తయారవుతుంది. దీన్ని తాగడం వల్ల కింద చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.

1. గులాబీ పువ్వుల టీని రోజూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మంపై ఉండే మచ్చలు మొటిమలు పోతాయి. చర్మంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. చ‌ర్మం శుభ్రంగా మారుతుంది.

2. గులాబీ పువ్వు రెక్కల్లో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. నొప్పులు, వాపులు తగ్గుతాయి.

3. మహిళలు గులాబీ పువ్వుల టీని తాగితే నెలసరి సరిగ్గా వస్తుంది. ఆ సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

4. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం, డయేరియా తగ్గుతాయి. మూత్రాశయ సమస్యలు పోతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.

5. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గులాబీ పువ్వుల టీని రోజూ తాగితే అధిక బరువు తగ్గుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *