ఫుల్‌గా తాగి ర‌చ్చ చేసిన వ‌ర్మ‌(వీడియో)

May 13, 2021

త‌న శిష్యుడు పూరి జ‌గ‌న్నాధ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా హిట్‌ను రామ్ గోపాల్ వ‌ర్మ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇన్ని రోజులుగా ట్విట్ట‌ర్‌లో ఈ సినిమాకు కావాల్సినంత ప్ర‌మోష‌న్ చేసిన వ‌ర్మ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. ఇస్మార్ట్ శంక‌ర్ టీమ్‌తో క‌లిసి ఓ ప‌బ్‌లో హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఫుల్‌గా మ‌ధ్య సేవించి చాంపేన్ బాటిల్ విప్పి పూరి జ‌గ‌న్నాధ్‌, ఛార్మీ, హీరోయిన్ల‌పై పోయ‌డంతో పాటు త‌న‌పై తానే పోసుకొని సంబ‌రాలు చేసుకున్నాడు. అంతేకాదు ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇక‌, మూసాపేట‌లోని శ్రీరాములు థియేట‌ర్‌లో త‌న శిష్యులు, ద‌ర్శ‌కులు అజ‌య్ భూప‌తి, అగ‌స్త్య‌తో క‌లిసి సినిమా వీక్షించేందుకు వ‌ర్మ ట్రిపుల్ రైడింగ్ వెళ్లాడు. అది కూడా హెల్మెట్ లేకుండా. ఈ ఫోటో కూడా వ‌ర్మ ట్విట్ట‌ర్‌లో పెట్ట‌డంతో ట్రాఫిక్ పోలీసులు సీరియ‌స్ అయ్యారు. రూ.1,345 ఫైన్ వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *