భార‌త్ జోలికి వ‌స్తే స‌హించం

May 13, 2021

భార‌త్ జోలికి వస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో స‌హించ‌బోమ‌ని తేల్చి చెప్పారు భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డిన నేప‌థ్యంలో భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చైనా ర‌క్ష‌ణ శాఖ మంత్రి వెయ్ పెంఘేలు స‌మావేశ‌మ‌య్యారు. స‌మావేశంలో రాజ్ నాథ్ సింగ్ చైనా హెచ్చ‌రిస్తూ… ప‌లు వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ వెల్ల‌డించింది.

చైనా స‌రిహ‌ద్దు ఒప్పందాల‌ను ఉల్లంఘిస్తుంద‌ని… భార‌త్ స‌మ‌గ్ర‌త‌ను, సౌభ్రాతృత్వాన్ని దెబ్బ తీయటానికి ప్ర‌య‌త్నిస్తే ఊరుకునేది లేద‌ని… దానిని ప‌రిర‌క్షించుకుంటామ‌ని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌కు ముందు ఎలాంటి ప‌రిస్థితి ఉందో… అలాంటి ప‌రిస్థితిని నెల‌కొల్పాల‌ని చైనాకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి తేల్చి చెప్పారు. వీలైనంత త్వ‌ర‌గా చైనా త‌మ బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని స్పష్టం చేశారు. ప్రాంతీయ శాంతి, సుస్థిర‌త‌ల‌ను ప‌రిర‌క్షించుకోవాలంటే చైనా త‌న దురుసుత‌నాన్ని వీడాల‌ని రాజ్ నాథ్ సింగ్ స్ప‌ష్టం చేశారు.

మాస్కోలో రెండు గంట‌ల‌కు పైగా జ‌రిగిన ఈ స‌మావేశంలో భార‌త్ త‌రుపున ర‌క్ష‌ణ శాఖ మంత్రితో పాటు ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్, ర‌ష్యాలోని భార‌త రాయ‌బారి వెంక‌టేశ్ వ‌ర్మ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *