కొంపముంచిన బర్త్ డే వేడుకలు

May 13, 2021

సాధారణంగా సందర్భం దొరికితే చాలు నీతి వాఖ్యలు వల్లించే నటీమణులు.. చెప్పే వాటికి చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదని ప్రియాంక చోప్రా నిరూపించింది. గతంలో సిగరెట్ లు తాగడం వలన కలిగే నష్టాల గురించి చెప్పి క్లాస్ తీసుకున్న ప్రియాంకా చోప్రా మొన్న జరిగిన తన పుట్టిన రోజు వేడుకల్లో చేతిలో సిగరెట్ తో ఫోజిచ్చి అడ్డంగా బుక్కైపోయింది. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో ప్రియాంకపై ఘాటుగానే ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫొటోలో ప్రియాంక భర్త నిక్ జోన్స్ తో పాటు ఆమె తల్లి కూడా ఉన్నారు. ఇటువంటి వివాదాలు ప్రియాంకను పెళ్ళైనప్పటి నుంచి వెంటాడుతున్నాయి. దీపావళి సందర్బంగా బాణాసంచా కాల్చొద్దని ఓ సందర్బంగా స్పీచ్ దంచి తన పెళ్లి వేడుకల్లో ఆ విషయం మరిచిపోయింది. ఇంకేముంది అప్పుడు కూడా ఇదే తరహాలో ట్రోల్స్ ఎదుర్కొంది ప్రియాంక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *