పోలవరంపై ఒడిషా పిటిషన్ పై సుప్రీంలో విచారణ

May 15, 2021

పోలవరంపై ఒడిషా పిటిషన్ పై సుప్రీంలో విచారణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ మదన్ బి. లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఏ అంశాలపై వాదనలు వినిపించాలో నివేదిక ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలను కోరింది. ఇప్పటి వరకు నివేదిక ఎందుకు తయారు చేయలేదని ఆయా రాష్ర్టాలను కోర్టు ప్రశ్నించింది.

ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు సహకరించలేదని కోర్టుకు ఆంధ్రప్రదేశ్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వాదనలపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోలవరంపై చర్చించాల్సిన అంశాలపై జులై 30 లోగా నివేదిక ఇవ్వాలని వాద, ప్రతివాదులను కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *