దిల్లీలో కవి సమ్మేళనం

May 13, 2021

శ్రీ సింహవాహినీ మహంకాళి (లాల్ దర్వాజ) బోనాల జాతర సందర్భంగా హైరదాబాద్ పాతనగర రచయితల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈనెల 17న కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఆ సంఘం కో ఆర్డినేటర్లు జి.మహేష్ గౌడ్, చింతపట్ల సుదర్శన్ తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన సా యంత్రం 4 గంటలకు ఈ కవి సమ్మేళనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కవిసమ్మేళనంలో ప్రముఖ కవులు నెల్లుట్ల రమాదే వి, శోభా పేరిందేవి, చీదెళ్ల సీతాలక్ష్మి, దూర విజయలక్ష్మి, సుమి త్రాదేవి, చింతపట్ల కె. హరనాథ్, కన్నోజు లక్ష్మీకాంతం,తదితరులు కవిత్వ పఠనం చేస్తారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *