పవన్ కళ్యాణ్ కాలుకు గాయం

May 15, 2021

జనసేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాలుకు గాయమైంది. కాలుకు గాయం కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొన్నాళ్ళుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల‌ని పర్య‌టిస్తున్న ప‌వ‌న్ మంగళవారం భీమ‌వ‌రంలో ప‌ర్య‌టించారు. ఓ ఫంక్ష‌న్ హాల్‌లో కార్య‌కర్త‌ల‌ని క‌లిసేందుకు వెళుతున్న క్ర‌మంలో కింద నేల త‌డిగా ఉండ‌డంతో జారి ప‌డ్డారు. ఆ క్ర‌మంలో కాలు మ‌డిమ బెణికింది. వెంట‌నే డాక్ట‌ర్స్ ప‌రీక్షించి కాలుకి క్యాప్ వేశారు. స్వ‌ల్ప విరామం అవ‌స‌ర‌న‌మ‌ని ఆయ‌న‌కి సూచించారు.

చే కూడా డాక్టర్ నే..

మ‌డిమ గాయంతో కాసేపు బాధ‌ప‌డ్డ ప‌వ‌న్ ప్ర‌థ‌మ చికిత్స తీసుకొని పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. అలానే వైద్యుల‌తో కూడా చర్చ‌లు జ‌రిపారు. తనకిష్టమైన వ్యక్తి చేగువేరా అని.. ఆయన కూడా డాక్టరేనని ఈ సంద‌ర్భంగా తెలిపారు ప‌వ‌న్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *