నాగార్జున ఇంటిని ముట్ట‌డించిన ఓయూ విద్యార్థులు

May 15, 2021

బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న సినీ న‌టుడు అక్కినేని నాగార్జున‌పై ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు భ‌గ్గుమంటున్నారు. బిగ్ బాస్ షోలో క్యాస్టింగ్ కౌచ్‌పై యాంక‌ర్ శ్వేతారెడ్డి, న‌టి గాయ‌త్రి గుప్తా గ‌ళం విప్ప‌డంతో వారికి మ‌ద్ద‌తుగా ఓయూ విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. శ‌నివారం ప‌లువురు ఓయూ విద్యార్థులు నాగార్జున ఇంటిని ముట్ట‌డించేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థి నేత‌లు మాట్లాడుతూ… పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో ఇద్ద‌రు మ‌హిళ‌లు లైంగిక వేధింపుల‌పై ప్రాణాల‌కు తెగించి పోరాడుతుంటే నాగార్జున ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. గ‌తంలో నాగార్జున బిగ్ బాస్ షోను ప‌నికిరాని షోగా చెప్పార‌ని గుర్తు చేశారు. గ‌తంలో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోకు నాగార్జున హోస్ట్‌గా ఉన్న‌ప్పుడు తామేమీ అన‌లేద‌ని చెప్పారు. నాగార్జున వెంట‌నే ఈ షో నుంచి త‌ప్పుకోవాలని, షో ను వెంట‌నే నిలిపివేయాల‌ని వారు డిమాండ్ చేశారు. శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *