పాఠశాల విద్యార్థులకు పండగే!

May 13, 2021

స్కూల్ విద్యార్థులకు పండుగ లాంటి విషయాన్ని కేంద్ర క్రీడల మంత్రి వెల్లడించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఆటలపై ఆసక్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో ఆటల పిరియడ్‌ను కశ్చితంగా ఉండేలా చేస్తామని క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత కల్పించేందుకు 2019 నుంచి విద్యార్థుల సిలబస్‌లో 50 శాతం తగ్గుతుందన్నారు. ఆటలు లేకుండా నేర్చుకొనే విద్యే సరైన విద్యావ్యవస్థ అనుకొనే దశకు మన సమాజం వచ్చిందని మంత్రి వ్యాఖ్యానించారు. 2019లోపు పాఠ్యాంశాల్లో సిలబస్‌ను 50శాతానికి కుదిస్తామని విద్యాశాఖ హామీ ఇచ్చిందని, దాని స్థానంలో క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ ఏడాది కొత్తగా 20 క్రీడా పాఠశాలలు రానున్నాయని, ఒక్కో పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.7-10 కోట్లు ఖర్చుపెట్టనుందని మంత్రి తెలిపారు. రెండు నుంచి మూడు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడమే దీని వెనకున్న ఉద్దేశం అని పేర్కొన్నారు.