నటి శ్రీరెడ్డి బెదిరిం

May 15, 2021

తమిళ నటుడు, దర్శక, నిర్మాత వారాహి తనను బెదిరిస్తున్నాడని నటి శ్రీరెడ్డి చెన్నై పోలీసు కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ‘సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను. అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్‌ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ఫిర్యాదులో పేర్కొంది. నటీమణులపై లైంగిక వేధింపుల గురించి నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌, ప్రధాన కార్యదర్శి విశాల్‌, కోశాధికారి కార్తీలకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా, వాళ్లు తనను పట్టించుకోలేదని ఆరోపించారు.