మార్కెట్‌లోకి కొత్త పవర్ బ్యాంకులు

May 13, 2021

కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీదారు బెల్కిన్ రెండు నూతన పవర్ బ్యాంక్‌లను తాజాగా విడుదల చేసింది. 5000 ఎంఏహెచ్, 10000 ఎంఏహెచ్ కెపాసిటీలు కలిగిన పవర్ బ్యాంక్‌లను పాకెట్ సిరీస్ పేరిట బెల్కిన్ విడుదల చేసింది. ఇవి చాలా తక్కువ బరువు కలిగి ఉండడమే కాక ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైస్‌లను చార్జింగ్ చేసుకునేందుకు బాగా ఉపయోగపడతాయి.
ఈ పవర్ బ్యాంక్‌లలో సేఫ్టీ ఫీచర్లను ఏర్పాటు చేశారు. దీని వల్ల చార్జింగ్ పెట్టి మరిచిపోయినా ప్రమాదం ఉండదు. అలాగే వీటిపై పవర్ కెపాసిటీ ఎంత ఉందో తెలియజేసే 4 ఎల్‌ఈడీ ఇండికేటర్లను అమర్చారు. 6 మైక్రో యూఎస్‌బీ పోర్టులను వీటికి అందిస్తున్నారు. దీని వల్ల ఒకేసారి 6 డివైస్‌లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ ధర రూ.2599 ఉండగా, 10000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ ధర రూ.3,999 గా ఉంది. వీటిని అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *