తెలంగాణ త‌హ‌శీల్దార్ల సంఘం అధ్య‌క్షుడిగా ఎస్‌.రాములు

May 15, 2021

తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) నూత‌న అధ్య‌క్షుడిగా ఎస్‌.రాములు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు అసోసియేష‌న్ కోశాధికారిగా కొన‌సాగుతున్నారు. శుక్ర‌వారం నాంప‌ల్లిలోని టీజీటీఏ కేంద్ర కార్యాల‌యంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏ.వి.భాస్క‌ర్ అధ్య‌క్ష‌త‌న టీజీటీఏ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. ఇటీవ‌ల అనివార్య కార‌ణాల వ‌ల్ల ఖాళీ ఏర్ప‌డ్డ కార్య‌వ‌ర్గ స్థానాల్లో నూత‌న స‌భ్యుల‌ను ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్య‌క్షులుగా డి.శ్రీనివాస్ కుమార్‌, ఆర్‌.పి.జ్యోతి, కోశాధికారిగా శ‌కుంత‌ల ఎన్నిక‌య్యారు.

త్వ‌ర‌లో రౌండ్ టేబుల్ స‌మావేశం
టీజీటీఏ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశానికి టీజీటీఏ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు, డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, రెవెన్యూ శాఖ ప‌టిష్ట‌త‌కు టీజీటీఏ ప‌నిచేస్తుంద‌న్నారు. పెండింగ్‌లో ఉన్న త‌హ‌శీల్దార్ల బ‌దిలీలు, ప‌దోన్న‌త‌ల స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కోరారు. కొత్త రెవెన్యూ చ‌ట్టం ప్ర‌జ‌ల‌కు, రెవెన్యూ ఉద్యోగుల‌కు ఆమోద‌యోగ్యంగా ఉండాల‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే కొత్త రెవెన్యూ చ‌ట్టం – ఉద్యోగుల పాత్ర‌పై అన్ని రెవెన్యూ ఉద్యోగ సంఘాల‌తో క‌లిసి రౌండ్ టేబుల్ స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *