మణిరత్నంకు గుండెపోటా..?!

May 15, 2021

ప్రఖ్యాత సినీ దర్శకుడు మణిరత్నం (62)కు గుండె పోటు రాలేదని అపోలో వైద్యులు స్పష్టం చేశారు. ఆయనకు గుండెపోటు అనేదే రాలేదన్నారు. కేవలం రెగ్యూలర్‌ చెకప్‌ కోసమే ఆయన ఆస్పత్రికి వచ్చినట్టు వెల్లడించారు. గురువారం మ‌ధ్యాహ్నం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయ‌న‌ను వెంట‌నే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించినట్టు ప్రచారం జరిగింది. దీంతో సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆందోళన చెందిన విషయం తెలిసిందే.

చిత్రసీమలో చెరగని ముద్ర..

భారతీయ చిత్రసీమలో మణిరత్నం చెరగని ముద్ర వేశారు. ఎన్నో చిత్రాలను మణిరత్నం తెరకెక్కించారు. నాయకుడు, దళపతి, రోజా, ముంబై, సఖి, ఓకే బంగారం, ఇద్ద‌రు వంటి ప్రఖ్యాత‌ సినిమాలను మణిరత్నం రూపొందించారు. త్వరలో రానున్న చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం ఉన్నారు. ఈ సినిమా తెలుగులో నవాబ్ పేరుతో రానుంది. రోజా, దళపతి, నాయకుడు, ఓకే బంగారం, బొంబాయి, గురు లాంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను అటు కొలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *