కేటీఆర్‌కి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హేష్ బాబు

May 15, 2021

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఇటు సామాన్యులు, అటు సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ వేదిక‌గా యువ నాయకుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. భ‌ర‌త్ అనే నేను చిత్ర సినిమా రిలీజ్ త‌ర్వాత జ‌రిగిన ఓ ఇంట‌రాక్ష‌న్ స‌మయంలో కేటీఆర్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మంచి స్నేహితుడు, అద్బుత‌మైన నాయ‌కుడు, మాన‌వ‌త్వం ఉన్న మంచి మ‌నిషి కేటీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు. మ‌హేష్ ట్వీట్‌కి కేటీఆర్ స్పందిస్తూ .. ధ‌న్య‌వాదాలు మ‌హేష్ అని రిప్లై ఇచ్చారు. ఇంక మెహ‌ర్ ర‌మేష్‌, ఈషారెబ్బా, బీఏ రాజు, ఆర్ జే చైతూ త‌దిత‌రులు కూడా కేటీఆర్‌కి ప్ర‌త్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *