బ్రేకింగ్: శ్రీనివాస్ రెడ్డి క‌న్నుమూత‌

May 15, 2021

ఆర్టీసీ కార్మికుల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని నిన్న ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఆర్టీసీ డ్రైవ‌ర్ శ్రీనివాస్ రెడ్డి క‌న్నుమూశారు. హైద‌రాబాద్ కుంద‌న్‌బాగ్‌లోని అపోలో డీఆర్డీఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న కాసేప‌టి క్రితం మ‌ర‌ణించారు. ఖ‌మ్మం డిపోలో డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి నిన్న ఉద‌యం ఆర్టీసీ కార్మికుల ధ‌ర్నాలో పాల్గొన్నారు. త‌ర్వాత ఇంటికెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. 90 శాతానికి పైగా కాలిన గాయాల‌తో చికిత్స పొందుతున్న ఆయ‌న మ‌ర‌ణించారు. శ్రీనివాస్ రెడ్డి మ‌ర‌ణంతో ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *