శ‌భాష్ మిథున్ రెడ్డి గారు.. కేశినేని నాని ట్వీట్‌

May 15, 2021

తెలుగుదేశం పార్టీ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ట్విట్ట‌ర్ వేదిక‌గా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, వైసీపీ నేత పీవీపీపై ట్విట్ట‌ర్‌లో వార్‌కు దిగిన కేశినేని ఇవాళ మ‌రో ట్వీట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌స‌భ ప‌క్ష నేత మిథున్ రెడ్డిని ఉద్దేశించి.. శ‌భాష్ మిథున్ రెడ్డి గారు.. ప్ర‌త్యేక హోదా సాధించే బాధ్య‌త మీదే అని ఒప్పుకున్నందుకు మిమ్మ‌ల్ని అభినందిస్తున్నాను. ప్ర‌త్యేక హోదా సాధిస్తే మిమ్మ‌ల్ని రాష్ట్రం న‌డిబొడ్డులో స‌న్మానం చేస్తాం. సాధించ‌లేక‌పోతే మీరేమి చేస్తారో కొంచెం చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. ఈ ట్వీట్‌కు ప్ర‌త్యేక హోదానే త‌మ ల‌క్ష్యం అని మిథున్ రెడ్డి చెప్పిన ఒక పేప‌ర్ క‌టింగ్‌ను కేశినేని జ‌త చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *