కాశ్మీర్ లో కాల్పులు.. ముగ్గురు మృతి

May 15, 2021

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఫైరింగ్‌లో ముగ్గురు చనిపోయారు. అందులో 16 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. రాళ్లు విసురుతున్న ఆందోళనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కుల్గామ్‌లోని రెడ్వాని ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో ఫైరింగ్ జరిగింది. ఆ కాల్పుల్లో మరణించిన వారిలో షకీర్ అహ్మద్, ఇర్షాద్ మజిద్, అండ్లీబ్ ఉన్నారు. మరో పది మంది గాయపడ్డారు. ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆందోళనలను అడ్డుకునేందుకు కుల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసును రద్దు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *