ఐటెం సాంగ్స్‌కి నై అంటున్న అందాల భామ‌..!

May 14, 2021

తెలుగు, త‌మిళ భాష‌ల‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించిన కాజ‌ల్ మ‌ళ్ళీ ఐటెం సాంగ్స్‌పై దృష్టి సారించ‌డం లేదు. ఎన్నో ఆఫ‌ర్స్ కాజ‌ల్ త‌లుపు త‌ట్టిన ఈ అమ్మ‌డు రిజెక్ట్ చేస్తుంద‌ట‌. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు స్పెష‌ల్ సాంగ్ కోసం కాజ‌ల్‌ని సంప్ర‌దించాడ‌ట‌. ఇందుకోసం ఫ్యాన్సీ రెమ్యున‌రేష‌న్ కూడా డిమాండ్ చేశాడ‌ని స‌మాచారం. అయితే ద‌ర్శ‌కుడు ఇచ్చిన ఆఫ‌ర్‌ని కాజ‌ల్ ఏ మాత్రం ఆలోచించ‌కుండా రిజెక్ట్ చేసింద‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌ధాన పాత్ర‌ల‌పైనే బాగా దృష్టి సారిస్తున్న కాజ‌ల్ వీలైతే గెస్ట్‌ అప్పీయ‌రెన్స్ ఇస్తానంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ వంశధార క్రియేషన్స్ బేనర్ పై శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తుండ‌గా ఇందులో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమా కోసం కాజ‌ల్‌కి భారీ మొత్తం ఆఫ‌ర్ చేశార‌ట‌. ఇక తేజ త్వ‌ర‌లో బెల్లంకొండ శ్రీనివాస్ , కాజ‌ల్ జంట‌గా ఓ సినిమా రూపొందించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. మొత్తానికి ఐటెం సాంగ్స్‌ని ప‌క్క‌న పెట్టి లీడ్ రోల్స్‌తో త‌న కెరియ‌ర్‌ని మ‌రింత బిల్డ‌ప్ చేసుకోవాల‌నుకుంటున్న కాజల్‌ని అభినందించాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *