మతగురువును ఉరి తీసిన జపాన్

May 15, 2021

రెండు దశాబ్దాల కిందట జరిగిన ఓ క్రూరమైన రసాయన దాడికి బాధ్యుడైన మత గురువు షోకో అసహారాతోపాటు అతని ఆరుగురు అనుచరులను జపాన్ ప్రభుత్వం శుక్రవారం ఉరితీసింది. షోకో అసహారా స్థాపించిన ఆమ్ షిన్‌రిక్యో (దీని అర్థం పరమసత్యం) అనే మతసంస్థ 1995లో టోక్యో సబ్‌వేలో సరిన్ అనే ప్రమాదకార గ్యాస్‌ను ప్రజలపైకి వదిలింది. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడగా.. వేల మంది తీవ్రంగా అస్వస్థులయ్యారు. అప్పట్లో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. 1955లో జన్మించిన అసహారా.. ఆమ్ షిన్‌రిక్యోను స్థాపించి జపాన్‌లో తనకంటూ ఒక విధేయవర్గాన్ని ఏర్పర్చుకున్నాడు. త్వరలో ప్రపంచం నాశనం కానున్నదని, దాన్నించి ఆమ్ షిన్‌రిక్యో సభ్యులు మాత్రమే తప్పించుకోగలరంటూ తన అనుచరులను నమ్మించాడు. తన కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్న వారిపై రసాయనికదాడులకు పాల్పడటమేగాక, హత్యలు చేయించేవాడు. ఇదేక్రమంలో 1995లో టోక్యోలోని సబ్‌వేలో సరిన్ దాడి జరిపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *