అటెండ‌ర్‌ను ‘అన్నా’ అని పిలిచిన సీఎం జ‌గ‌న్‌

May 15, 2021

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి క‌నిపిస్తారు. జ‌గ‌న్‌ పెద్ద‌ల‌ను గౌర‌వించ‌ర‌ని, జ‌గ‌న్‌కు పొగ‌ర‌ని గ‌తంలో ప్ర‌త్య‌ర్థుల నుంచి అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చేవి. అయితే, పాద‌యాత్ర‌తో పాటు ప‌లు సంద‌ర్భాల్లో ఈ ప్ర‌చారం, విమ‌ర్శ‌లు త‌ప్ప‌ని జ‌గ‌న్ వైఖ‌రి స్ప‌ష్టం చేసింది. తాజాగా అసెంబ్లీలోనూ జ‌గ‌న్ ఈ విష‌యాన్ని మ‌రోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమ‌లు సంద‌ర్భంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. జ‌గ‌న్ 45 ఏళ్ల‌కే పింఛ‌న్ ఇస్తామ‌ని చెప్పారంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ఓ పేప‌ర్ క‌టింగ్‌ను స‌భలో చూపించారు. దీనికి కౌంట‌ర్ ఇచ్చేందుకు గానూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆ పేప‌ర్ క‌టింగ్ త‌న‌కు పంపించాల్సిందిగా కోరారు. చంద్ర‌బాబు వ‌ద్ద ఉన్న పేప‌ర్‌ను త‌న‌కు ఇవ్వాల్సిందిగా అటెండ‌ర్‌ను అన్నా అని సంభోదిస్తూ కోరారు. ఒక ముఖ్య‌మంత్రి అటెండ‌ర్‌కు సైతం ఎంతో గౌర‌వం ఇస్తూ అన్నా అని పిల‌వ‌డంతో స‌భ్యులు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *