చైనాను ఇన్ డైరెక్ట్ గా కూడా దెబ్బ కొడుతున్న భార‌త్

May 15, 2021

స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర నిత్యం గొడువ‌కు దిగుతున్న చైనాకు భార‌త్ త‌న‌దైన శైలిలో జ‌వాబు చెబుతోంది. చైనా ఎప్పుడు భార‌త్ స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర గొడువ‌కు దిగుతుంటే… చైనాను బార్డ‌ర్ ద‌గ్గ‌ర ఎదుర్కొంటునే మ‌రోవైపు ఆర్థికంగా దెబ్బ‌తీస్తుంది. టిక్ టాక్ యాప్ తో చైనాను దెబ్బ‌తీయ‌టం మొద‌లుపెట్టిన భార‌త్… రిసెంట్ గా ప‌బ్జీతో పాటు మ‌రో 117 యాప్ ల‌ను ఇండియా నిషేధించింది. భార‌త సార్వ‌భౌమాధికారం, స‌మ‌గ్ర‌త‌, దేశ ర‌క్ష‌ణ‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, స‌మాచార‌, సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

టెన్సెట్ అనే చైనా కంపెనీ ప‌బ్జీ గేమ్ ను రూపొందించింది. ప‌బ్జీ బ్యాన్ తో టెన్సెట్ కంపెనీకి దాదాపు 5000 కోట్ల న‌ష్టం వాటిల్ల‌నుంది. ఇండియాలో ప‌బ్జీని 17.5 కొట్ల మంది ఇన్ స్ట‌ల్ చేసుకున్నారు. లౌక్ డౌన్ కాలంలో యువ‌త ఎక్కు వ స‌మ‌యం ప‌జ్జీ గేమ్ తోనే గ‌డుపుతున్నారు. అలాగే ప‌బ్జీ గేమ్ ద్వారా చైనా కంపెనీలు భార‌తీయ యువ‌త డేటాను చోరీ చేస్తున్నాయనే అనుమానంతో భార‌త ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.

                     విద్యార్థుల జీవితాల‌ను నాశ‌నం చేస్తున్న ప‌బ్జీ

పబ్జీ గేమ్ విద్యార్థుల జీవితాల‌తో ఆట‌లాడుకుంటోంది. అంతే కాదు బంధాల‌ను కూడా తెంచుతోంది. ప‌బ్జీ గేమ్ వ‌ల్ల కొంత మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నాన్న గేమ్ ఆడ‌నివ్వ‌కుండా కొట్టాడ‌ని, అమ్మ గేమ్ ఆడితే తిట్టింద‌ని ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారు ఉన్నారు. అలాగే ప‌బ్జీ ఆట‌లో ప‌డి టైమ్ తెలియ‌కుండా ఆట‌డంతో మ‌రికొంత మంది పిచ్చివారుగా మారారు. అంతే కాకుండా విద్యార్థుల వ్య‌క్తిత్వంపై అలాగే ప్ర‌వ‌ర్త‌న పై ప‌బ్జీ ప్ర‌భావం చూపుతుంది. విద్యార్థులు లౌక్ డౌన్ కాలంలో చ‌దువును మ‌రిచిపోయేలా ఈ గేమ్ ప్ర‌భావితం చేసింది.

                  ప‌బ్జీ ప్లేస్ లో ఫౌజీ

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ప‌బ్జీ బ్యాన్ నేప‌థ్యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ఉద్య‌మంలో భాగంగా ఫౌజీ గేమ్ ను తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేవ‌లం వినోదం మాత్ర‌మే కాకుండా సైనికుల త్యాగాల‌ను కూడా ఈ గేమ్ ద్వారా తెలిజేయ‌నున్న‌ట్లు అక్ష‌య్ తెలిపారు. ఫౌజీ ద్వారా వ‌చ్చే ఆదాయంలో 20 శాతం భార‌‌త్ కా వీర్ ట్ర‌స్ట్ కు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *