జిన్నా ఆశ‌యాల‌ను నేరవేర్చుతా – ఇమ్రాన్ ఖాన్

May 15, 2021

జిన్నా ఆశయాల‌ను నేర‌వేర్చేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, త‌ప్ప‌కుండా జిన్నా ఆశయాల‌ను నేర‌వేర్చ‌తాన‌ని పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆయ‌న సార‌థ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ ఆ దేశ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దూసుకుపోతుంది. ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ రాజ‌కీయాల్లో ఇర‌వై రెండేళ్లుగా పోరాటం చేస్తున్నాన‌ని, ఇప్పుడు ప్ర‌భుత్వం ఏర్పాటుచేసే అవ‌కాశం అభించింద‌నా హార్షం వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నిక‌ల కోసం దేశ ప్ర‌జ‌లు ఎన్నో త్యాగాలు చేశార‌ని, ఈ ఎన్నిక‌లు చ‌రిత్రాత్మ‌క‌మ‌ని ప్ర‌శ‌సించారు.
పాకిస్థాన్‌లో ప్ర‌జాస్వామ్యం బ‌ల‌ప‌డునుంద‌ని, అవినీతిలేని పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తామ‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తుంద‌ని, పేద‌ల బాధ తీర్చ‌డ‌మే త‌న ప్ర‌ధాన అజెండా అని వివ‌రించారు. పొరుగు దేశాల‌తో స‌త్సంబంధాలు ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఇమ్రాన్ ఖాన్ ఈసంద‌ర్భంగా చెప్పుకోచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *