జపాన్‌లో భారీ వర్షాలు

May 13, 2021

జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల వల్ల సుమారు 15 మంది మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. హిరోషిమాలో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెప్పారు. హిరోషిమా, ఎహిమి, యమగుచి ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో వందల సంఖ్యలో జనం ఇండ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రహదారులను మూసివేశారు. హెచ్చరికలు కూడా జారీ చేశారు. నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతానికి మిలిటరీ వాటర్ ట్రక్కులను తీసుకువెళ్తున్నాయి. ప్రతి ఏడాది జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం ఉంటుంది

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *