జ‌య‌ల‌లిత అస‌లు గ‌ర్భం దాల్చ‌లేదు

May 15, 2021

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత త‌న జీవితకాలంలో ఎప్పుడూ గ‌ర్భం దాల్చ‌లేద‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. బెంగ‌ళూరుకు చెందిన అమృత అనే యువ‌తి తాను జ‌య‌ల‌లిత కూతురిని అంటూ కోర్టులో కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విచార‌ణ మ‌ద్రాస్ హైకోర్టులో జ‌రిగింది. దీనిపై ప్ర‌భుత్వ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వాద‌న‌లు చేస్తూ జ‌య‌ల‌లిత ఎప్పుడూ గ‌ర్భం దాల్చ‌లేద‌ని, అమృత ఆమె కూతురు అన‌డానికి ఎటువంటి ఆధారాలూ లేవ‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ఆస్తి కోసమే అమృత ఈ ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని కోర్టుకు విన‌వించారు. అమృత పుట్టిన తేదీకి స‌రిగ్గా నెల రోజుల క్రితం జ‌య‌ల‌లిత పాల్గొన్న ఓ కార్య‌క్ర‌మం వీడియోను ఆదారంగా ప్ర‌భుత్వం అంద‌జేసింది. ఈ వీడియోలో జ‌య‌ల‌లిత గ‌ర్భంతో క‌నిపించ‌లేదు. అయితే, జ‌య‌ల‌లిత పార్థీవ‌దేహానికి డీఎన్ఏ టెస్టు చేయాల‌ని అమృత కోరుతుంది. కానీ, డీఎన్ఏ టెస్టు చేయాలంటే జ‌య‌ల‌లిత బందువులు ఉన్నార‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ స్ప‌ష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *