మందుబాబుల‌కు శుభ‌వార్త‌.. ఇక తాగ‌కుండానే ఫుల్ కిక్‌

May 15, 2021

మందుబాబుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది గ్లెన్లీవెట్ అనే విస్కీ కంపెనీ. ఇక నుంచి విస్కీ తాగడానికి వాట‌ర్‌, సోడా లేదా కూల్ డ్రింక్ వంటివి ఏవీ అవ‌స‌రం లేదు. అస‌లు మందు క‌లుపుకొని తాగ‌డానికి గ్లాసు కూడా అవ‌స‌రం లేదు. ఎందుకంటే మందుబాబుల‌కు స‌రికొత్త అనుభూతి ఇచ్చేందుకు విచిత్ర‌మైన ఐడియా వేసింది ఈ కంపెనీ.

తాగ‌డానికి కొత్త ప‌ద్ధ‌తిని క‌నిపెట్టింది. అదే మందు గోలీలు. మందు గోలీలు అంటే జ్వ‌రానికో, నొప్పుల‌కో వేసుకునే గోలీలు కాదు.. కిక్ ఎక్క‌డానికి వేసుకునే గోలీల‌ను గ్లెన్లీవెట్ బ్రాండ్‌ త‌యారుచేసింది. ఇక నుంచి మూస ప‌ద్ధ‌తిలో తాగ‌కుండా ఈ విస్కీ క్యాప్సుల్ వేసుకుంటే స‌రిపోతుంద‌ట‌. ఈ క్యాప్సుల్ వేసుకుంటే సాధార‌ణంగా విస్కీ తాగిన‌ట్లుగానే కిక్ ఇస్తుంది.

అయితే, ఈ గోలి మింగ‌వ‌ద్దంట‌. నాలుక‌పై పెట్టుకోగానే క‌రిగిపోతుంద‌ట‌. అందుకే వీటిని డిస్సాల్వ‌బుల్ విస్కీ క్యాప్సుల్‌గా పిలుస్తున్నారు. సోడా, వాట‌ర్ ఏదీ లేకుండానే ఇది చ‌ల్ల‌గా నోట్లోకి జారిపోతుంద‌ట‌. స‌ముద్ర నాచు నుంచి త‌యారు చేసిన ఒక ప్లాస్టీక్ క‌వ‌ర్ లాంటి ప‌దార్థంలో విస్కీని నింపు ఈ క్యాప్సుల్స్ త‌యారు చేస్తున్నారు.

నాట్‌ప్లా అనే సంస్థ‌తో క‌లిసి గ్లెన్లీవెట్ ఈ విస్కీ క్యాప్సుల్స్‌ను త‌యారు చేసింది. త్వ‌ర‌లోనే ఇవి మార్కెట్‌లోకి విడుద‌ల కానున్నాయి. భార‌త్‌లోకి అడుగుపెట్టేందుకు మాత్రం ఇంకా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు. కానీ, మందు తాగ‌డం అనేది ఒక ప‌నిగా పెట్టుకొని బాతాకాణీ కొడుతూ ఎంజాయ్ చేసే మందుబాబులు.. ఇలా సైలెంట్‌గా గోలీ మింగేసి వెళ్లిపోవాలంటే ఇష్ట‌ప‌డ‌తారో లేదో చూడాలి మ‌రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *