ఆడపిల్ల పుట్టిందని.. భార్యపై వేడి గంజి పోసిన భర్త

May 14, 2021

హైదరాబాదులోని రాజేంద్రనగర్‌లో ఘోరం జరిగింది. ఆడపిల్లకు జన్మనిచ్చిందని మహిళపై శాడిస్టు భర్త వేడి గంజిపోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. తాండూరుకు చెందిన పి.చెన్నయ్య(33) బతుకుదెరువు కోసం భార్య శాంత(28)తో పీరంచెరువు ప్రాంతానికి వలస వచ్చాడు. ఇప్పటికే శాంత ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. రెండవ కాన్పు సందర్భంగా ఆడపిల్ల పుట్టడంతో ఆ సమయంలో శాంతను తీవ్రంగా కొట్టడంతో కాలు విరిగింది.

మళ్లీ ఆడపిల్లను కన్నందుకు..
శాంత ఈ నెల 20న మూడోకాన్పులో మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. 23న శాంత ఇంటికి రాగా భర్త చెన్నయ్య ఆమెతో గొడవ పడి కొట్టాడు. అనంతరం వేడి గంజిని తీసి శాంతపై పోశాడు. దీంతో శాంత చాతి, కడుపు, నడుముపై గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *