ఆటోలో ఐదు లక్షలు… నిజాయితీ చాటిన డ్రైవర్!

May 13, 2021

ఒక ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో లభ్యమైన రూ. 5 లక్షలను సంబంధిత వ్యక్తికి అప్పగించాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని పూణెలో ప్రకాష్ కరమ్ చందానీ(72) అనే వృద్ధుడు ఆటోలో ప్రయాణించి తన ఇంటికి చేరుకున్నాడు. కాగా ఆటో డ్రైవర్ మారుతి తన ఆటోలో ఆ వృద్ధుడు మరచిపోయిన క్యాష్ బ్యాగును గమనించాడు. దానిలో రూ. 5 లక్షలు ఉన్నాయి. దీంతో మారుతి వెంటనే ప్రకాష్ కరమ్ చందాని ఇంటికి చేరుకుని ఆ సొమ్మును అప్పగించాడు. కాగా ఇంతలోనే కరమ్ తన సొమ్ము పోయినట్టు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా మారుతి… కరమ్‌కు సొమ్ము అందించిన విషయం తెలుసుకున్న పోలీసులు మారుతిని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. అతని నిజాయితీని మెచ్చుకుని సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *