మూడు గంటలు.. 25 వేల డాలర్ల విరాళాలు

May 15, 2021

అమెరికాలో నల్లజాతీయుడి కాల్పుల్లో మరణించిన శరత్ కొప్పు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడం కోసం చేపట్టిన క్రౌడ్ ఫండింగ్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. శరత్ కజిన్ రఘు చోడవరం దీనికోసం శనివారం ప్రత్యేకంగా గోఫండ్‌మి అనే అకౌంట్‌ను క్రియేట్ చేశారు. దీనికి వెల్లువలా విరాళాలు వస్తున్నాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే 25 వేల డాలర్లు రావడం విశేషం. శరత్ కూడా అందరిలాగే ఎన్నో కలలు కన్నాడని, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అతడు.. అవసరం ఉన్నవాళ్లకు సాయం చేసేవాడని రఘు చెప్పాడు. కానీ అనుకోకుండా అతని జీవితం ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదని అతను వాపోయాడు. యూనివర్సిటీ ఆఫ్ మిసోరిలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న శరత్.. నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *