రూ.4 కే ఎంఐ టీవీ, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లు

May 15, 2021

భారత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల మార్కెట్‌లో సంచలనాత్మక బ్రాండ్‌గా షావోమికి పేరొంది. ఈ కంపెనీ బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లను లాంచ్‌ చేస్తూ భారతీయ వినియోగదారులను తెగ ఆకట్టుకుంటోంది. దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు సైతం చెక్‌ పెడుతోంది. ఈ కంపెనీ మన మార్కెట్‌లోకి ప్రవేశించి రేపటికి నాలుగేళ్లు పూర్తవుతుంది.

10,11,12 తేదీలలోనే..

జూలై 10న మంగళవారం ఈ కంపెనీ గ్రాండ్‌గా తన నాలుగో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఎంఐ అభిమానుల కోసం షావోమి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ.కామ్‌లో జులై 10న ప్రారంభమయ్యే ఈ వార్షికోత్సవ సేల్‌ 12 వరకూ కొనసాగనుంది. ఎంఐ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌లో 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీని, రెడ్‌మి వై2 (3జీబీ+32జీబీ)ను, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం నాలుగు రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. 10, 11, 12వ తేదీల్లో సాయంత్రం 4 గంటలకు లక్కీ కస్టమర్లకు కేవలం నాలుగు రూపాయలకే ఈ ఉత్పత్తులు లభిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *